Header Banner

అర్రే.. మళ్లీ అడ్డంగా దొరికిన విజయ్ దేవరకొండ రష్మిక.. నెటిజ‌న్ల కామెంట్స్‌! మొద‌టిసారి వారి డేటింగ్..

  Mon Apr 07, 2025 11:17        Entertainment

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఏప్రిల్ 5న తన 29వ‌ బ‌ర్త్‌డేను ఒమన్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. అక్కడ దిగిన ఫొటోలు ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా షేర్ చేయగా... చాలా మంది 'విజయ్ దేవరకొండ ఎక్కడ?' అంటూ కామెంట్ చేశారు. ఇక రెండు రోజుల‌ తర్వాత రౌడీ బాయ్ సోషల్ మీడియాలో కొన్ని ఫొటోలు పంచుకున్నారు. వాటి బ్యాక్‌గ్రౌండ్‌, ర‌ష్మిక ఉన్న ప్ర‌దేశం తాలూకు బ్యాక్‌గ్రౌండ్ ఒకటే కావడంతో మ‌రోసారి దొరికిపోయారు. ఇద్ద‌రూ ఒమ‌న్‌లోనే గ‌డిపారంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఒమన్ వెళ్లలేదు.‌ వేర్వేరుగా వెళ్లారు. రష్మిక కంటే ఒక్కరోజు ముందు ముంబై నుంచి రౌడీ బాయ్ వెళ్లగా.. ఆ తర్వాతి రోజు నేషనల్ క్రష్ వెళ్లింది. దాంతో ఇద్దరూ ఒకేచోటుకు వెళ్లారనే సంగతి నెటిజ‌న్లకు అర్థమైంది. బర్త్ డే ఫోటోలను రష్మిక విడుదల చేయగా.. నెటిజ‌న్లు ఎక్కువమంది అడిగిన ప్రశ్న 'విజయ్ దేవరకొండ ఎక్కడ? అని. ఇప్పుడు ఆ హీరో సముద్ర తీరంలో గుర్రపు స్వారీ చేస్తున్న, తీరం వెంబడి న‌డుస్తున్న‌ ఫొటోలను విడుదల చేశారు. దాంతో రష్మికతో పాటు విజయ్ కూడా అక్కడే ఉన్నాడని జనాలకు అర్థమైంది. 

 

ఇది కూడా చదవండి: బాలీవుడ్‌ హీరోయిన్‌ ఇంట తీవ్ర విషాదం.. తల్లి కన్నుమూత!

 

తమ ప్రేమ గురించి మరోసారి క్లూ ఇచ్చాడో లేక కావాలని దొరికేశాడో కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ రష్మిక ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక విజయ్ దేవరకొండ గానీ, రష్మిక గానీ తామిద్దరం ప్రేమలో ఉన్న‌ట్లు ఇప్పటి‌ వరకు ఒక్కసారి కూడా చెప్పలేదు. కానీ, ఇద్దరూ ఒకే చోట ఉన్నారని సంగతి తెలిసేలా వారి ప్రవర్తన ఉంటుంది. కాగా, 2023 జనవరిలో మొద‌టిసారి వారి డేటింగ్ గురించి పుకార్లు ప్రారంభమయ్యాయి. ఇక గతంలో రష్మిక మందన్న 'వీ ఆర్ యువా'కు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండతో తన అనుబంధం గురించి మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. "నేను, విజయ్ కలిసి పెరిగాం. కాబట్టి ప్రస్తుతం నా జీవితంలో నేను చేసే ప్రతి పనిలో ఆయన సహకారం ఉంది. నేను చేసే ఏ పనిలోనైనా ఆయన సలహా తీసుకుంటాను. నాకు ఆయన అభిప్రాయం అవసరం. ఆయన అంత త్వ‌ర‌గా 'సరే' అనే వ్యక్తి కాదు. ఇది మంచిది... ఇది మంచిది కాదు... నేను అనుకునేది ఇదే... ఇలా విష‌యం ఏదైనా ఆయన క‌చ్చితంగా చెబుతాడు. ఆయన నా మొత్తం జీవితంలో అందరికంటే వ్యక్తిగతంగా నాకు ఎక్కువగా మద్దతు ఇచ్చాడు. కాబట్టి, ఆయనను నేను నిజంగా గౌరవించే వ్యక్తిగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే... విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ, మళ్ళీరావా సినిమాల ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్న 'కింగ్‌డమ్‌' టీజర్ కొన్ని రోజుల క్రితం విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాంతో పాన్ ఇండియా హిట్ కొట్టడం కన్ఫర్మ్ అని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. అలాగే రష్మిక విషయానికి వస్తే నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో 'ది గర్ల్ ఫ్రెండ్' చేస్తున్నారు.

 

ఇది కూడా చదవండి: మరో నామినేటెడ్ పోస్టును ప్రకటించిన ముఖ్యమంత్రి! చైర్మన్‌గా ఆయన నియామకం!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో 10 తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం! ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స..

 

వైసీపీకి షాక్.. మాజీ మంత్రి తమ్ముడు అరెస్ట్! మరో రెండు కేసులు కూడా.. పోలీస్టేషన్‌లోనే దాడి!

 

విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఏపీలోని సర్కారు బడుల్లో కోడింగ్‌ పాఠాలు.! ఈ మూడు జిల్లాల్లో 248 మందికిపైగా..

 

మహిళల ఖాతాల్లో నెలకు ₹2,500 ! అది చేస్తేనే డబ్బు వస్తుందట! నిజమేనా ఇది?

 

రేషన్ కార్డు దారులకు బిగ్ అలర్ట్.. e-KYC ప్రక్రియకు గడువు పొడిగింపు - ఇది చేసిన వారికే.! కేంద్రం కీలక నిర్ణయం..

 

కీలక దశకు పాస్టర్ ప్రవీణ్ మృతి.. మాజీ ఎంపీపై కేసు న‌మోదు! వైసీపీ గుండెల్లో గుబులు..

 

సెల్ఫీ వీడియోతో కలకలం! ఎస్ఐ వేధింపులతో ఆత్మహత్యాయత్నం!

 

ఆ రూట్ ని మోడరన్ రహదారిగా.. సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్! నాలుగు లైన్ల రహదారి రూపంలో..!

 

ఏపీలో మెడిసిన్ మేకింగ్ హబ్.. భారీ పెట్టుబడులతో మెగా ప్రాజెక్ట్! 7,500 మందికి ఉపాధి కల్పన!

 

అమెరికాను వీడొద్దు వెళ్తే రాలేరు.. హెచ్‌1బీ వీసాదారులకు - టెక్‌ దిగ్గజాల అలర్ట్‌! ఉద్యోగుల గుండెల్లో గుబులు..

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #RashmikaMandanna #VijayDeverakonda #Oman #ViralPhotos #DatingRumors